మన ఇంట్లో ఈ వస్తువులు క్యాన్సర్ కారకాలని తెలుసా!

-

మన చుట్టూ ఉండే వాతావరణం రోజురోజుకు విషపూరితం అవుతుందన్న విషయం అందరికీ తెలుసు. దాని నుంచి కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంటిని కూడా చాలా హైజీన్‌గా చూసుకుంటూ తాము చాలా ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తున్నామని అనుకుంటారు. కానీ ఇంట్లో ఈ పది వస్తువులు ఉంటే మీ ఆరోగ్యకరమైన జీవనం అంతా ఒక ఊహ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. మనం ఇంట్లో తరచూ వాడే కొన్ని వస్తువుల వల్ల క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటంటే..

- Advertisement -

పెయింట్: ఇంట్లో ఎక్కడైనా పెయింట్ కాలితే అప్పుడు వచ్చే పొగ మనకు చాలా కీడు చేస్తుంది. ఆ పొగలో బెంజీన్, టోల్యూన్, ఇథైల్‌బెంజీన్ సహా పలు ఇతర హెవీ మెటల్స్ కూడా విడుదలవుతాయి. అవి శ్వాసకోస సమస్యలు, చర్మ వ్యాధులకు దారి తీస్తాయి.

ప్లాస్టిక్: ఇది డబ్బాల రూపంలో ఉన్నా బాటిళ్ల రూపంలో ఉన్న ప్లాస్టిక్ వల్ల మనకు చాలా ప్రమాదం ఉంటుంది. తరచుగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం వల్ల మన శరీరం మైక్రో ప్లాస్టిక్స్‌ సహా పలు ఇతర ప్రమాదకర రసాయణాలకు ఎక్స్‌పోజ్ అవుతుంది. వాటి వల్ల రొమ్ము క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదాలు అమితంగా పెరుగుతాయి. ఆఖరికి ప్లాస్టిక్‌ను చెత్తలో పడేసినా, రీసైకిల్ చేసినా, కాల్చేసినా సరే వాటి నుంచి ప్రమాదకర రసాయనాలు వెలువడతాయి. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల కూడా ఎన్నో కెమికల్స్ నేరుగా మన నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయి.

నాన్ స్టిక్ వస్తువులు: కడగడానికి సులభంగా ఉంటుందనో.. పని తేలికగా అవుతుందనో ప్రస్తుతం నాన్‌స్టిక్ వస్తువుల వినియోగం రోజురోజుకు అధికం అవుతుంది. కానీ వీటి వినియోగం చాలా ప్రమాదకరమైన నిపుణులు చెప్తున్నారు. వీటిని వినియోగించిన ప్రతిసారీ వాటిపై ఉండే నాన్‌స్టిక్ కోటింగ్ విడిపోతుంటుంది.. అది కాస్తా పొయిపై ఉండటంతో ఎన్నో రకాల ప్రమాకర వాయువులను వెలువరుస్తుంది. వాటి వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమ్యను గుర్తించే తాజాగా PFOA ఫ్రీ నాన్‌స్టిక్ వస్తువులు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటి వల్ల ఎటువంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. దీంతో వీటి వినియోగం మంచిదే అని కొందరు నిపుణులు చెప్తున్నారు.

కొవ్వొత్తులు: అవేనండీ క్యాండిల్స్. అంటే ఈ మధ్య సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌కు మార్కెట్లో గిరాకీ బాగా పెరిగింది. క్యాండిల్ వెలిగేటప్పుడు కూడా ఇళ్లంతా సువాసనలు వెదజల్లుతుంటుందని చాలా మంది వీటిని తెగ కొనేస్తున్నారు. కానీ వీటి వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఈ క్యాండిల్స్ వెలిగే సమయంలో అందులో సువాసన కోసం కలిపే కెమికల్స్ కరిగి విష వాయువులను విడదల చేస్తాయి. వాటి వల్ల క్యాన్సర్ సహా మరెన్నో రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. తలనొప్పి, అలెర్జీస్ కూడా వస్తాయట.

మద్యం: మద్యం అతిగా సేవిస్తే అదొక్కటే ఎన్నో రకాల క్యాన్సర్లకు మన శరీరాన్ని నిలయంగా మార్చేస్తుంది. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ కూడా పునరుద్ఘాటిస్తుంది.

ప్రాసెస్స్‌డ్ మాంసం: ప్రాసెస్స్‌డ్ మాంసం రోజూ తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట. వీటిలో గ్రూప్ 2ఏ కార్సినోజెన్ అనే కెమికల్ ఉంటుందని, ఇది అనేక రకాల క్యాన్సర్లకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.

కీటకాల మందులు: ఈ మధ్య ఇంట్లో ఉండే కీటకాలను చంపడానికి అనేక రకాల మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి వినియోగం కూడా భారీగానే జరుగుతుంది. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ప్రకారం.. గర్భిణులు, చిన్నపిల్లలపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటి వల్ల కణితులు కట్టడం, క్యాన్సర్లు రావడం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.

కార్పెట్స్, మ్యాట్రిసెస్: ఎక్కువ కాలం వినియోగించిన కార్పెట్స్, మ్యాట్రిసెస్ వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వీటి వల్ల చిన్నపిల్లలు ఎక్కువ ప్రమాదంలో పడతారని అధికారులు వెల్లడిస్తున్నారు. వీటిలో రకరకాల ప్రమాదకరమైన క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయని, ఇవి పిల్లలో లోపలకు వెళ్లి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను అధిదకం చేస్తాయిన వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Read Also: వెనక్కు నడిస్తే ఇన్ని ప్రయోజనాలా..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...

Ravanth Reddy | ‘ఢిల్లీకి ఎన్ని సార్లైనా వెళ్తా.. ఈరోజు అందుకే వెళ్తున్నా’

తన ఢిల్లీ పర్యటనలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి(Ravanth...