ఈ లక్షణాలతో బాడీలో బి12 విటమిన్ లోపించిందని గుర్తుపట్టండి..

0
107

మన బాడీ లో అన్ని విటమిన్ లలో బి 12 ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడుతాయి. అంతేకాకుండా మన శరీరంలో అత్యంత ముఖ్య భాగమైన బ్రెయిన్ సంబంధిత సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య వైద్యులు చెబుతున్నారు. అందుకే కేవలం పిండిపదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు మాత్రమే తీసుకోవడమే కాకుండా.. వీటితోపాటు విటమిన్లు, లవణాలు సూక్ష్మపోషకాలు కూడా బాడీకీ చాలా అవసరం.

మెదడు, నాడి వ్యవస్థ చక్కగా పనిచేయడానికి కారణమయ్యే ముఖ్య విటమిన్ బి12. కానీ ఒకవేళ శరీరంలో బి12 లోపిస్తే ప్రాణానికే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి తగినంత బి12 లభించనప్పుడు జ్ఞాపకశక్తి తగ్గుముఖం పడుతుంది. అందుకే దీని లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

దీని లక్షణాలు విపరీతమైన అలసట, మానసిక స్థితి సమస్యలు, చర్మ మార్పుల నుండి జీర్ణశయాంతర సమస్యలు, అసాధారణ జ్ఞాపకశక్తి కోల్పోవడం, పెరిగిన హృదయ స్పందన రేటు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి  లక్షణాలు ద్వారా ఈ సమస్యను గుర్తుపట్టాలి. ఒకవేళ ఈ లక్షణాలు కనిపిస్తే పాలు, గుడ్లు, పెరుగు, కొవ్వు చేపలు, ఎరుపు మాంసం వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.