వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇవి తీసుకోవాల్సిందే!

These should be taken to keep the body cool in summer!

0
76

భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మార్చిలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉందంటే ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఎండలకు ప్రజలు భరించలేకపోతున్నారు. ఎండ నుండి ఉపశమనం కోసం ఎన్ని చిట్కాలు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఎండల వల్ల డీహైడ్రేషన్ సమస్య అనేది సర్వసాధారణం అయింది. వేసవి కాలంలో ఎక్కువ చెమట పట్టడం వల్ల శరీరంలోని మినరల్స్ మొత్తం బయటకి వెలువడుతాయి. ఇది డీహైడ్రేషన్‌ సమస్యకి కారణమవుతుంది. ఈ పరిస్థితిలో మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి నీరు లేదా మరేదైనా ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం చాలా అవసరం.

వేసవి కాలంలో మజ్జిగ, మామిడి జ్యూస్‌, కొబ్బరి నీరు, షర్బత్ వంటి అనేక ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవచ్చు. ఇవి రుచికరమైనవే కాకుండా చాలా ఆరోగ్యకరమైనవి అని మనందరికీ తెలిసిందే. వీటిలో విటమిన్లు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచడానికి  ఎంతో సహాయపడుతాయి.

మజ్జిగ:పెరుగు, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, వేయించిన ఇంగువ కలిపి మజ్జిగ తయారు చేస్తారు. ఇది ప్రోబయోటిక్ డ్రింక్. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మజ్జిగ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

కొబ్బరి నీరు: కొబ్బరి నీరు చాలా ఆరోగ్యకరమైన పానీయం. ఎండాకాలంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది పోషకాహారంతో నిండి ఉంటుంది. ఈ పానీయంలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎలక్ట్రోలైట్స్ గొప్ప మూలం. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయం చేస్తుంది.

నిమ్మకాయ రసం: సాధారణంగా నిమ్మకాయ షర్బత్‌ని ఇష్టపడని వారుండరు. నిమ్మకాయ షర్బత్‌ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్. ఇది శరీరాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి పనిచేస్తుంది. దీని రుచి తీపి, పుల్లగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని చాలా చల్లబరుస్తుంది. ఇందులో చాలా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయం చేస్తుంది.