పాలతో వీటిని అస్సలే తినకూడదు..అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం

These should not be eaten with milk at all. Doing so is life threatening

0
118

పాలలో అనేక పోషకాలుంటాయి. ప్రతి రోజు గ్లాసు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. రోజు గడవాలంటే ఖచ్చితంగా ఇంట్లో కాసిన్ని పాలు ఉండాల్సిందే. పొద్దున లేవగానే పాలు ఇంట్లో ఉండాల్సిందే. పాలు ఉంటేనే చాయ్ కానీ.. కాఫీ కానీ చేసుకుంటాం.  రోజూ పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు.

అయితే పాలతో కలిపి కొన్ని పదార్థాలను తీసుకుంటే మీరు ప్రమాదంలో పడినట్టే. అయితే.. మనం ఏ ఆహారం తీసుకున్నా.. కొన్ని ఆహారాలను కలిపి తినకూడదు. దాని వల్ల లేనిపోని సమస్యలు వస్తుంటాయి. కొన్ని పదార్థాలను కలిపి తింటే అనారోగ్య సమస్యలు రావడంతో పాటు.. అవి ప్రాణాలకే ముప్పు వచ్చేలా చేస్తాయి.

పాలు తాగుతూ నాన్ వెజ్ తిన్నారంటే ఇక అంతే. పాలు తాగుతూ.. చికెన్, మటన్, ఫిష్, గుడ్లు.. ఏవి కూడా తినకూడదు. అలా చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం జీర్ణం కాదు. మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. అందుకే.. పాలు తాగుతున్నారంటే నాన్ వెజ్ ను పక్కన పెట్టండి.

అరటి పండు తింటూ పాలు అస్సలు తాగకండి. అరటిపండుకు, పాలకు అస్సలు పడదు. అలా చేస్తే.. జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఒకవేళ.. మిల్క షేక్ లాంటివి తాగితే మాత్రం.. దాంట్లో కాసింత దాల్చిన చెక్క పౌడర్ వేసి తాగితే బెటర్. లేదంటే జీర్ణ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.

చాలామందికి పుల్లటి పదార్థాలంటే చాలా ఇష్టం ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ, సంత్రా, బత్తాయి.. లాంటి పండ్లను కొందరు లొట్టలేసుకుంటూ తింటారు. ఎందుకంటే.. అవి పుల్లపుల్లగా ఉంటాయి. అయితే.. ఈ పుల్లని పదార్థాలతో కలిపి పాలను అస్సలు తీసుకోకూడదు. అలా చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయి. గుండెలో మంట కూడా వస్తుంది.