ఈ లక్షణాలు కనిపిస్తే మంకీపాక్స్ వైరస్ కి సంకేతం కావచ్చు..

0
38

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. అయితే ఈ మహమ్మారి పీడ నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మంకీపాక్స్ మళ్ళి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో జనాలు కరోనా కొత్త కేసులు తగ్గుతున్నందుకు సంతోషపడాలో లేదా మంకీపాక్స్ విరుచుకుపడుతున్నందుకు బాధపడాలో తెలియని దుస్థితి ఏర్పడింది.

ఈ మంకీపాక్స్ బారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్ర‌పంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరిస్తుంది. ఈ వైరస్ ముఖ్యంగా, వర్షాపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనిపించడంతో పాటు.. మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే ఈ వైరస్ భారీన మనం పడకుండా ఉండాలంటే ఈ లక్షణాలు కనిపించగానే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

ప్రారంభ దశలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత, చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు కనిపిస్తాయి. అనంతరం చర్మం ఎర్రగా కందినట్టు అయితే వీలయినంత తొందరగా డాక్టర్ ను కలవడం మంచిది. ఒకవేళ మంకీపాక్స్ ఇన్ఫెక్ష‌న్ సోకిన వారు మూడు వారాల పాటు పెంపుడు జంతువుల‌కు దూరంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.