Healthy Heart | గుండె ఆరోగ్యం కోసం వీటిని తినాల్సిందే..!

-

మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవం గుండె. రాత్రింబవళ్లు ఇది పనిచేస్తూనే ఉంటుంది. అటువంటి ఈ గుండె ఈ మధ్య చాలా వీక్‌గా మారుతోంది. చిన్నారులు సైతం హార్ట్ ఎటాక్ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. రానురాను గుండె సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునే బాధ్యత వారిపైనే ఉంటుందని, సరైన డైట్ మెయింటెయిన్ చేయడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని అంటున్నారు నిపుణులు. శరీరంలో కొవ్వు పెరిగితే అది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గుండెకు పని పెరిగి బకెట్ తన్నే ప్రమాదం పొంచి ఉంటుందని వైద్యులు అంటున్నారు. మరి గుండె ఆరోగ్యంగా(Healthy Heart) ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..

- Advertisement -

శరీరంలో అధికంగా పెరిగిన కొవ్వును తగ్గించడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ ఒమెగా 3 ఆమ్లాలు ఉండే ఆహారలు.. చేపలు, వాల్‌నట్స్, అవిసెలు వంటి వాటిని మన రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

దాంతో పాటుగా మన ఆహారంలో ప్రొటీన్ పుష్కలంగా ఉండే బీన్స్, చిక్కుళ్ళు, టోఫూ వంటి వాటిని కూడా కలుపుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ప్లాంట్ బేస్డ్‌ ప్రొటీన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని చెప్తున్నారు. దాంతో పాటుగానే మన రుచి గ్రంథులకు సంతృప్తి కలిగించే కొవ్వులను తీసుకోవడం తగ్గించాలని చెప్తున్నారు నిపుణులు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని వివరిస్తున్నారు నిపుణులు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. దీని వల్ల బాడీలోని చెడు కొవ్వు(Bad Cholesterol) శాతం తగ్గుతుందని, మంచి కొవ్వు పెరుగుతుందని చెప్తున్నారు. అందుకోసం ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, బార్టీ, ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. దీని వల్ల్ జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. యాంటీ ఆక్సిండెంట్స్ అధికంగా ఉండే ఫలాలు తీసుకోవడం కూడా బాగా పెంచాలని చెప్తున్నారు నిపుణులు.

ఇవన్నీ చేస్తూనే ప్రతి రోజూ ఉదయాన్ని కాసేపు వ్యాయామం చేయడం కూడా గుండె ఆరోగ్యాన్ని(Healthy Heart) పెంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా వ్యాయామం బాగా పనిచేస్తుంది. దాంతో పాటుగానే మన బరువును కూడా అదుపులో ఉంచుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాకుండా బరువు కూడా తగినంతే ఉండాలని, వయసు, ఎత్తును బట్టి ఎంత బరువు ఉండాలో అంతే మెయింటెన్ చేయాలని నిపుణులు అంటున్నారు.

Read Also: రోజూ రోటీలు లాగించేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...