చాలా మంది ఈ రోజుల్లో వేగంగా తమ పనులు ముగించాలి అని పనులతో పాటు ఫుడ్ తీసుకోవడం కూడా వేగంగా తీసుకుంటున్నారు, అంతేకాదు భోజనం చేసే సమయంలో కూడా ఇలా వేగంగా ఫుడ్ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు. ఇలా చేయడం వల్ల ప్రమాదం ఉంటుంది అని సరిగ్గా నమలకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
ఇక భోజనం టిఫిన్ ఏది తిన్నా నెమ్మదిగా తినాలి… బాగా నమిలి తినాలి.. ఒకవేళ వేగంగా ఇలా భోజనం తిన్నా సరిగ్గా నమలకుండా ఆహారం తీసుకున్నా చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ మీరు తినేదానికంటే ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు, నమల కుండా తింటే ఆహారం ఎక్కువగా వెళ్లిపోతుంది, వేగంగా ఎక్కువగా ఫుడ్ తింటారు.
సరిగ్గా నమలని కారణంగా జీర్ణ సమస్యలు వస్తాయి. పేగుల సమస్యలు కూడా వస్తాయి.. ఇక ఊబకాయం బాగా పెరుగుతుంది, షుగర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు, ఎక్కుళ్లు రావడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఫుడ్ తీసుకోండి.
.