Hair care tips: తలస్నానం చేసిన తర్వాత తలను తడిగా వుంచుకోకండి. దీనివల్ల చుండ్రు ఏర్పడుతుంది. అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటి వాటితో వెంటనే జుట్టు ఆరబెట్టుకోవటం మంచిది కాదు. జుట్టును నెమ్మదిగా టవల్ తో తుడిచి పొడిగా అయ్యేటట్లు చెయ్యాలి.
జుట్టు తడిగా వున్నప్పుడు తల దువ్వుకోకూడదు. కుదుళ్ళలో నుండి వెంట్రుకలు ఊడి వస్తాయి. జుట్టు తడి పొడిగా వున్నప్పుడు దువ్వుకోండి.
తలకు రోజూ నూనె రాసుకోవటం లేదా వారానికి రెండుసార్లయినా నూనె రాసుకోవడం వల్ల కేశాలు బలంగా ఉంటాయి. జుట్టు జిడ్డుగా వున్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు.
చుండ్రు విపరీతంగా వుంటే నాలుగు టొమోటోలను తీసుకుని వాటిని మెత్తగా నలిపి ఆ గుజ్జును తలకు బాగా పట్టించండి. రెండు నిమిషాలు మర్ధన చెయ్యండి. ఆ తర్వాత తలస్నానం చెయ్యాలి.