మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి..

0
103

ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఒత్తిడి, పనిభారం కారణంగా మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడే వారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి వివిధ రకాల మందులు వాడడం వల్ల ఆశించిన మేరకు ఫలితాలు రాకపోగా..అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఇంటి చిట్కాలతో ఈ సమస్యను ఎలా తొలగించుకోవాలో మీరు కూడా ఓ లుక్కేయండి..

మైగ్రేన్ వచ్చిన్నట్టు మీకు అనిపిస్తే లైట్లను ఆర్పేయ్యడం వల్ల ఈ సమస్య నుండి బయట పడొచ్చు. ఎందుకంటే ఈ ఎక్కువ కాంతి వల్ల తలనొప్పి ఎక్కువయ్యే ఆస్కారం అధికంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు చీకటిగా,నిశబ్దంగా ఉన్న గదిలో ఉండడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

రోజు నిర్ధిష్ట సమయానికి తినకపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున రోజు నిర్ధిష్ట సమయానికి తినేలా చూసుకోవడంతో పాటు..చాక్లెట్,మద్యం అలవాట్లు ఉంటే తొందరగా మానుకోవడం మంచిది. ఒత్తిడి వల్ల మైగ్రేన్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.వీలైనంత వరకు ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి.