చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి..

0
33

సాధారణంగా అందరికి అప్పుడప్పుడు చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు వచ్చి అనేక ఇబ్బందులు పడుతుంటారు. మనం చాలా సేపు ఒకే భంగిమ‌లో చేతులు లేదా కాళ్ల‌ను క‌దిలించ‌కుండా అలాగే కూర్చుని లేదా నిలుచుని ఉండడం వల్ల తిమ్మిర్లు వస్తాయని అందరికి తెలుసు. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు తిమ్మిర్లు తగ్గించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.

శ‌రీరంలో విట‌మిన్ బి12 లోపం ఉన్నా ఇలాగే తిమ్మిర్లు వస్తాయని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది. అందుకే విట‌మిన్ బి12 లోపించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి ట్యాబ్లెట్ల‌ను వాడుకోవడం మంచిది. రొయ్య‌లు, చేప‌లు, మ‌ట‌న్ లివ‌ర్‌, పుట్ట గొడుగులు, చీజ్‌, ఓట్స వంటి ఆహారాల‌ను తీసుకోవడం వల్ల విట‌మిన్ బి12 వృద్ధి చెంది చేతులు, కాళ్ల‌లో తిమ్మిర్లు తగ్గిపోతాయి .

ముఖ్యంగా డ‌యాబెటిస్ ఉన్న‌వారికి కూడా ఇలాగే తిమ్మిర్లు వస్తుంటాయి. కావున షుగ‌ర్ వాడకాన్ని వీలయినంత తగ్గిస్తే ఈ సమస్య తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక ఇవే కాకుండా న‌రాల స‌మ‌స్య‌లు, థైరాయిడ్‌, కిడ్నీ స‌మ‌స్య‌లు, అధిక బ‌రువు, కండ‌రాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డ‌డం, కాల్షియం లోపం, గ‌ర్భిణీల‌కు తిమ్మిర్లు ఎక్కువ‌గా వస్తుంటాయి. కావున వీరు కూడా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.