మీ చెవిలో ఉన్న గుబిలిని ఈ రెండు చిట్కాలతో పొగొట్టవచ్చు

మీ చెవిలో ఉన్న గుబిలిని ఈ రెండు చిట్కాలతో పొగొట్టవచ్చు

0
119

మందికి చెవిలో గుబిలి అనేది అట్టలు కట్టేసి మరీ ఉంటుంది.. ఇలా ఉన్న గుబిలిని బయటకు తీయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. . కాని ఇష్టం వచ్చినట్లు చెవిలో ఏది పడితే అది పెట్టి తీయకూడదు. మనం చేయాల్సిందల్లా స్నానం చేశాక టవల్ ను ఎక్కువగా చెవిలోకి దూర్చకుండా శుభ్రం చేయడమే.. సింపుల్ గా ఇంటిలో చిట్కాలతో ఎక్కువగా ఉన్న గుబిలి తొలగించుకోవచ్చు మరి ఆ చిట్కా ఏమిటో తెలుసుకుందాం.

సెలైన్ వాటర్.. చెవిలో ఇది నాలుగు చుక్కలు వేస్తే అనవసర వ్యాక్స్ తొలగిపోతుంది.. మరి ఈ సెలైన్ వాటర్ మనం ఇంటిలో తయారు చేసుకోవచ్చు అది ఎలాగంటే ఒక గిన్నెలో లీటరు నీరు తీసుకుని మరిగించాలి, ఈ మరిగిన నీటిలో టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఇందులో కాటన్ బాల్స్ వేయాలి.. వాటిని ప్లేట్ లో పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉప్పు నీరు ఉన్న దూదిని ప్రెస్ చేసి మీ చెవిలో నాలుగు డ్రాప్స్ ఉప్పు నీరు వేయాలి.. రెండు వైపులా ఇలా చేసుకోవాలి..ఇలా రెండు చెవుల్లో వదలడం వల్ల అనవసర గుబిలి తొలగిపోతుంది.

కొబ్బరి నూనె కూడా దీనికి మంచిదే దీనికోసం మీరు ఏం చేయాలంటే, 50 లేదా 100 గ్రాముల కొబ్బరి నూనె తీసుకుని గోరు వెచ్చగా చేసుకోండి, అందులో రెండు కాటన్ బాల్స్ వేయండి, ఆ కాటన్ బాల్స్ లో నూనె మీ చెవిలో డ్రాప్స్ గా వేయండి. రెండు వైపులా ఇలా చేయడం వల్ల అనవసర వ్యాక్స్ తొలగిపోతుంది. మరీ ఎక్కువగా పోటు వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.