రాత్రి సమయంలో ఫోన్ వాడుతున్నారా? అయితే మీ ప్రాణానికే ప్రమాదమట..

0
103

ఈ మధ్యకాలంలో ఫోన్ వాడకం ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం లేచిన అప్పుడు మొదలు పెడితే రాత్రి పడుకునే  వరకు కూడా ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతూనే ఉన్నారు. ఫోన్ అధికంగా వాడడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఫోన్ వాడడం వల్ల ఎలాంటి నష్టాలు చేకూరుతాయో మీరే చుడండి.

ఈ టైప్–2 డయాబెటిస్ సమస్య వేధించడానికి గల ముఖ్య కారణం రాత్రిపూట ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం. వాటి నుండి నీలిరంగు కాంతి విడుదలై అది టైప్–2 డయాబెటిస్ దారితీస్తుందని ఓ అధ్యయనంలో తేలడంతో పరిశోధకులు ఫోన్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిందని సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే నీలిరంగు కాంతి నిద్రను తగ్గిస్తుందని, ఇది క్రమంగా శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత చర్యలకు దారితీసిందని పరిశోధనలో వెల్లడయింది.

అయితే రాత్రిపూట ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడితే ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల పురుషుల్లో సంతాన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అంతేకాకుండా మెదడుపై దుష్ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందట. ఇక మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల కాన్సర్ లాంటి సమస్యలు కూడా  వేదించే అవకాశం ఉంది.