కరోనా పుట్టుక రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

0
106

ఇండియాలో కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ రాకాసి మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో పాటు కొత్త వేరియంట్లు పుట్టుక రావడం కలకలం రేపుతోంది. అయితే కరోనా వైరస్ పుట్టుక రహస్యాలు ఎప్పటికప్పుడు డబ్ల్యూహెచ్ వో కి చెబుతన్నామంటోంది. దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న కరోనా పుట్టుక వెనుక ఉన్న రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం..

2019 ఆగస్టులోనే కరోనా వైరస్ చైనాలో ప్రబలినట్లు స్పష్టమవుతోందంటున్నారు హార్వడ్ నిపుణులు. ఇందుకు సంబంధించి చైనా హాస్పిటల్స్‌ దగ్గర్లోని శాటిలైట్‌ ఫొటోలు, సెర్చ్‌ ఇంజిన్‌ డేటా బేస్‌ ఆధారంగా రిపోర్ట్‌ తయారు చేశామని తెలిపారు. అయితే చైనా మాత్రం ఆ రిపోర్ట్‌ను ఖండించింది. వైరస్‌ పుట్టిన వూహాన్‌ హాస్పిటల్స్‌ దగ్గర పార్కింగ్‌ లాట్స్‌ శాటిలైట్‌ ఫొటోలను చూశామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి అనవాళ్లు లేవని కొట్టిపారేసింది. వూహాన్‌ మార్కెట్‌లో కరోనాను గుర్తించే సమయానికే వైరస్‌ వ్యాప్తించిందన్న వాదనకు తమ దగ్గర ఉన్న ఆధారాలు మద్దతిస్తున్నాయని చెప్పింది హార్వడ్ పరిశోధనా సంస్థ తెలిపింది.

అయితే, డయేరియా, దగ్గుకు సంబంధించి లక్షణాల గురించి చైనీయులు సెర్చ్‌ చేశారని దాని ఆధారంగా రిపోర్ట్‌ తయారు చేశామని రిసెర్చ్‌కాలర్స్ అంటున్నారు. సీజన్ తో సంబంధం లేకుండానే చైనీయులు ఆగస్టులో శ్వాస సంబంధిత వ్యాధుల నివారణ కోసం ఆన్ లైన్ లో ఎక్కువగా వెతికారని రిసెర్చ్‌ ద్వారా వెల్లడైంది. దీంతో అప్పటి నుంచే వైరస్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోందని హార్వడ్ నిపుణులు స్పష్టం చేశారు.