మంకీపాక్స్ పుట్టుక రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?

0
109

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. అయితే ఈ మహమ్మారి పీడ నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మంకీపాక్స్ మళ్ళి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో జనాలు కరోనా కొత్త కేసులు తగ్గుతున్నందుకు సంతోషపడాలో లేదా మంకీపాక్స్ విరుచుకుపడుతున్నందుకు బాధపడాలో తెలియని దుస్థితి ఏర్పడింది.

ఈ మంకీపాక్స్ బారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్ర‌పంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరిస్తుంది. ఎందుకంటే మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడంతో వ్యాధి గుర్తింపు, కట్టడి, నివారణపై డబ్లూహెచ్వో ఐదు కీలక సూచనలు చేసింది. మంకీపాక్స్ మొదటగా జంతువుల వచ్చి వాటి నుండి మనుషులకు వ్యాపిస్తుందని డబ్లూహెచ్వో తెలిపింది.

ఇది సోకిన వారితో ఇతరులు జాగ్రత్తగా ఉండడంతో పాటు..రోగి కాంటాక్ట్ ను వెంటనే ఐసోలేట్ చేస్తే వ్యాధి విస్తరించకుండా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. మంకీపాక్స్ నివారణలో ఉపయోగపడే  యాంటీవైరల్స్‌, వ్యాక్సిన్లను వాడటంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.  మంకీపాక్స్ నివారణ చర్యల కోసం అందుబాటులో ఉన్న అన్ని పద్దతులను పాటించాలని వెల్లడించింది.