మొలకెత్తిన పెసలతో ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది..!

0
111

ప్రతి ఒక్కరు చర్మ సౌందర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. వీటి కోసం బయట దొరికే క్రీములను వాడుతుంటారు. కానీ వాటిని వాడడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సహజ సిద్దమైన పదార్థాలను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం మంచిది. అందులో పెసలను కూడా వాడడం మంచిది.

మొలకెత్తిన పెసలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటిలో విటమిన్ A, C వంటి పోషకాలు చర్మాన్ని కాపాడతాయి. అంతేకాకుండా మొలకెత్తిన పెసలలో ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు చర్మం కందిపోకుండా కోమలంగా ఉండేలా చేస్తాయి. అందుకే మొలకెత్తిన పెసలతో చేసిన ఫేస్ ప్యాక్ లను వాడడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

కొద్దిగా పెసరపిండిలో, చిటికెడు పసుపు, పచ్చిపాలు కలిపి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించి ముఖాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.