కొత్తిమీర మన రోజువారీ వంటల్లో వేసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే?

0
125

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే కొత్తిమీర అంటే కూడా చాలామంది ఇష్టపడరు. కానీ ఒక్కసారి వాటి లాభాలు తెలిస్తే మళ్ళి ప్రతికూరలో అదే వేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..

ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసన పెంచడానికే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులకు కూడా చెక్ పెట్టడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించే అంటిమెంట్స్ లో కూడా దీనిని ఉపయోగించి తయారు చేస్తారు.

కొత్తిమీరలో అనేక రకాల  యాంటీ-ఆక్సిడేంట్స్ ఉండడం వల్ల రోజు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కావున మన రోజువారీ కూరలో ఈ కొత్తిమీర ఉండేలా చూడడం మంచిది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. తలనొప్పి, మానసిక అలసటను మరియు టెన్సన్స్’ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.