పొట్ట‌లో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..

0
102

ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దానివల్ల కడుపులో ఆహారం జీర్ణం కాకా..గ్యాస్ సమస్యతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి వివిధ చిట్కాలను ప్రయత్నించినా ఆశించినమేరకు ఫలితాలు లభించకపోతే ఒక్కసారి ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి..

స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అజీర్తి, మాన‌సిక ఒత్తిడి, నిద్ర‌లేమి, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేసే ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వల్ల ఈ సమస్య వేధిస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు భరించలేక బయట దొరికే వివిధ రకాల సిరప్స్ వాడుతుంటారు. వాటిని వాడడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కావున ఇంటి చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవడం మంచిది.

అల్లం ర‌సాన్ని, తేనెను క‌లిపి ఉద‌యం పూట తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల అనుకున్న దానికంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకకుండా మన రోజువారీ వంటకాలలో శొంఠి పొడిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌గ్గ‌డంతోపాటు మ‌నం తిన్న ఆహారం కూడా త్వ‌ర‌గా జీర్ణించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తొందరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.