స్క్రీన్ ని ఎక్కువ సేపు చూస్తున్నారా? అయితే మీరు త్వరగా మరణిస్తారట..

0
41

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఫోన్ కు బానిసై వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదయం మొదలుపెడితే  సాయంత్రం 9 గంటలు దాటినా ఫోన్ చూసే వారి సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో రోజుకు కనీసం రెండు గంటలకు ఎక్కువ స్క్రీన్ చూస్తే ఆయుష్షు తగ్గుతుందని వెల్లడయింది.

ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల ప్రాణాంతక సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు సైతం ఆన్ లైన్ క్లాసులని ఎక్కువ సమయం స్క్రీన్ ని చూడడానికి గడుపుతున్నారు. మనకు తెలిసిన వరకు స్క్రీన్ చూస్తే కేవలం కంటి అలసట, మెడ నొప్పి, ఆందోళన, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయనుకుంటాము.

కానీ స్క్రీన్ దగ్గర కూర్చుని గడిపే సమయం రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ ఉంటే… స్ట్రోక్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక గంట స్క్రీన్ సమయం ఒక వ్యక్తి యొక్క జీవితకాలం 22 నిమిషాలు తగ్గిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇంకా గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతూ వ్యక్తిని మరణానికి దగ్గర కూడా చేస్తుందట. అందుకే వీలైనంత వరకూ స్క్రీన్ ని చూడడం తగ్గిస్తే మంచిది.