వెన్నునొప్పి వేధించకుండా ఉండాలంటే ఈ జాగ్రతలు తీసుకోండి..

0
94

ప్రస్తుతం మారుతున్న జీవనవిధానంతో ఎక్కువ సమయం కూర్చొని గడిపే వారి సంఖ్య పెరుగుతుంది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తూ ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తూ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నొప్పిని భరించలేక వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అయినా ఆశించిన మేరకు ఫలితాలు మాత్రం లభించవు. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకొని చూడండి..

వెన్నునొప్పితో బాధపడేవారు మూత్ర రాళ్ల నుండి సాధారణ కండరాల సమస్యలకు దారి తీయొచ్చని చెబుతున్నారు. రోజు ఆహారాన్ని మితంగా తీసుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గడంతో పాటు..వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది. అతిగా తినడం వల్ల ఈ సమస్య అధికం అయ్యే అవకాశం ఉంటుంది.

యోగా, క్రీడలు, నృత్యం వంటి వాటి కోసం కొంత సమయం కేటాయించడం వల్ల కండరాలు, ఎముకలు బలపడి ఈ సమస్య నయం అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా కనీసం అర్థగంటకు ఒకసారి అయినా లేచి నడవడం వల్ల ఈ సమస్య నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. నిద్ర వల్ల కూడా వెన్నునొప్పి తగ్గుముఖం పడుతుంది.