బెండకాయ తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే?

0
90

సాధారణంగా బెండకాయలు తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బెండకాయను రోజు వారి డైట్ లో చేర్చుకుంటే మంచి లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు సమృద్ధిగాలభించడం వల్ల శరీరానికి అమితమైన మేలు చేకూరుతుంది. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పని చేయడంతో పాటు త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా దోహదపడుతుంది.

సాధారణంగా మనం బెండకాయను సాంబార్ రూపంలో, కూర రూపంలో చేసుకొని తింటుంటాము.  దీంట్లో విటమిన్ ఎ, బి, సిమరియు కె వంటి పోషకాహారాలు అధికంగా ఉండడం వల్ల ఎలాంటి సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. కానీ ఆస్తమా, డియాబేటిస్ వంటి వ్యాధిగ్రస్థులు ఈ బెండకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

బెండకాయను గర్భిణీలు, మోకాళ్లనొప్పి ఉన్నవాళ్లు అధికంగా  తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఎముకలు బలంగా, ధృడంగా తయారుచేయడంలో కూడా సహాయపడుతుంది. కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా సౌందర్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా మచ్చలు, మోటిమలు, ముడతలను తొలగించడంలో దోహదపడుతుంది.