సాధారణంగా పుట్నాలు అంటే చాలామంది ఇష్టపడతారు. వీటిలో ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే హాస్టల్లో ఉండే పిల్లలకు ప్రోటీన్ల లోపం కలగకూడదనే ఉద్దేశ్యంతో వీటిని ప్రతి రోజు పెడతారు. మాములుగా మన ఇళ్లల్లో పుట్నాల పప్పును ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటుంటాము. వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది.
పుట్నాల పప్పును శనగల నుండి తయారుచేస్తారని అందరికి తెలిసిన విషయమే. వీటిని కనుక రోజు మన డైట్ లో చేర్చుకున్నట్టు అయితే గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు..గుండె సంబధిత సమస్యలు మన దరికి చేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికీ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు పుట్నాల పప్పును రోజూ తినడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వీటిని స్రీలు తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఎలాంటి జీర్ణాశయ సంబంధిత సమస్యలకైనా చెక్ పెట్టే సత్తా వీటికి ఉంటుంది.