ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ఆరోగ్యంగా ఉండడం కోసం మనకు ఇష్టం లేని పదార్దాలను సైతం మన డైట్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే నేరేడు పండ్లు కూడా కనీసం వారానికి ఒకసారి తినేలా చూసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పండ్లల్లో శరీరానికి అవసరమైన పోషకాలతోపాటు ఔషధ గుణాలు ఉంటాయి. వీటితో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలివే..!
కేవలం నేరేడు పండ్లే కాకుండా ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ పండు ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు దివ్య ఔషధంగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కావున షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని ఎన్ని తింటే ఆరోగ్యానికి అంత మంచి చేకూరుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంతో పాటు వివిధ ఆరోగ్యసమస్యలను తొలగిస్తుంది.
గుండె జబ్బులు, జీర్ణాశయ సంబంధిత సమస్యలను, ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలను నయం చేయడంలో నేరేడు పండ్లు ఎంతో సహాయపడతాయి. కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ కూడా ఉపయోగపడతాయి. నేరేడు పండ్లను తినడం వల్ల రక్తం శుద్ది అయ్యి బీపీ నియంత్రణలోకి వస్తుంది. నోటి సంబంధిత సమస్యలను కూడా నేరేడు పండ్లు ఇట్టే తొలగిస్తాయి.