ఆడవాళ్ళు అందంగా ఉండాలని ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా కళ్ళతో తమ అందాన్ని మరింత అధికం చేసుకోవచ్చని కాటుక పెట్టుకుంటూ ఉంటారు. ఎంత చిన్న కళ్ళైనా కాటుకతో అలంకరిస్తే పెద్దవిగా, అందంగా కనిపించడం అందరికి తెలిసిన విషయమే. కేవలం అందంగా కనబడడానికే కాకుండా..ఆరోగ్య పరంగా కూడా అమితమైన మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
కాటుకను కళ్ళకు పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. కానీ ప్రతి ఒక్కరు కాటుక పెట్టుకునే ముందు ఒక చిన్న తప్పు చేస్తారు. అదేంటంటే..కాటుక పెట్టుకొనే ముందు చాలామంది ముఖాన్ని కడుక్కోరు. కానీ ఎప్పుడైనా కాటుక పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కళ్లపై తడిలేకుండా తుడుచుకొని పెట్టుకోవడం వల్ల కళ్ళు తాజాగా కనబడతాయి. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడుతుంది.
కానీ కొన్ని కాటుకలలో కెమికల్స్ కలుపుతుంటారు. వాటి వల్ల అనేక నష్టాలు చేకూరే అవకాశం ఉంది. అందుకే ఎల్లప్పుడు నాణ్యమైన కాటుక వాడుతూ ఉండాలి. కాటుక వాడినప్పుడు దురద పెట్టటం, కళ్ళు మండడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కాటుక పెట్టుకోవడం మానేయాలి. లేదంటే ప్రాణాపాయ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.