ఆహా వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోమితే ఇన్ని ప్రయోజనాలా..

0
130

ప్రకృతిలో అనేక రకాల ఔషద మొక్కలు ఉంటాయి. వాటివల్ల అనేక రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. కలబంద, తులసి, వేప గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూర్వంలో చాలామంది ప్రజలు వేపపుల్లలతో దంతాలను తోముకునేవారు. కానీ ప్రస్తుతం వేపపుల్లలు అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు.

వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోమితే అద్భుతమైన లాభాలు పొందవచ్చు. దంతాల మ‌ధ్య‌, చిగుళ్లపై ఉండే సూక్ష్మ జీవుల‌ను చంప‌డంలో వేప పుల్ల ఉపయోగపడుతుంది. నోట్లో ఉండే క్రిముల‌ను చంపడంలో వేపపుల్ల కీలక పాత్ర పోషిస్తుంది. నోటిలో, గొంతులో ఇన్ ఫెక్ష‌న్లు రాకుండా చేయ‌డంలో వేప పుల్ల సహాయపడుతుంది.

వేపపుల్లతో పళ్ళు తోముకోవడం వల్ల నోరు తాజాగా ఉంటుంది.అంతేకాకుండా చిగుళ్లు, దంతాలుధృడంగా తయారవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. దంత చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను తొలగిపోవాలంటే వేపపుల్లతో రోజు పళ్ళు తోముకోవాలి. రోజు వేప పుల్ల, బొగ్గు ఉప్పుతో దంతాలు శుభ్రం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.