క్యారెట్‌ వల్ల ఇన్ని లాభాలా?..తెలిస్తే షాక్ అవుతారు!

What are the benefits of carrots? .. I would be shocked to know!

0
41

ప్రస్తుతం అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. తినే ఆహారం, మానసిక ఆందోళన, కాలుష్యం తదితర కారణాల వల్ల ఎందరో వివిధ రకాల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఇక శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను కంట్రోల్లో ఉంచుకునేందుకు క్యారెట్‌లను తీసుకోవడం ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

క్యారెట్‌లో బీటా-కెరోటిన్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్‌ ఎగా మారి శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాలను బయటకు తొలగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాదు క్యారెట్‌ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటుంది. ఇందులో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంతో అధికంగా ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకు, కంటి ఆరోగ్యం ఉంచేందుకు విటమిన్లు, ఖనిజాలు అధిక సంఖ్యలో ఉంటాయి.

క్యారెట్ రసం దృష్టికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్‌లోని విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది.

క్యారెట్ జ్యూస్ రోజూ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‏ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా శరీరంలో వచ్చే వాపులను సైతం అధిగమించవచ్చు. బాక్టీరియా, వైరస్ లాంటివి నశిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి6, కె. పొటాషియం, పాస్ఫరస్‏లు ఎముకలను దృఢంగా మారుస్తాయి. క్యారెట్‌ గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది.