వేసవిలో నెయ్యి తినడం వల్ల బోలెడు ప్రయోజనాలివే?

0
119

ఆరోగ్యంగా ఉండాలని ఎవరుమాత్రం కోరుకోరు. అందుకు మనం కొన్ని ఆహారపదార్దాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో నెయ్యి తినడం వాళ్ళ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి ఎన్నో పోషకాలు అందిస్తాయి. దీన్ని పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటుంది.

పిల్లల్లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహార పదార్థాలతోపాటు నెయ్యి కలిపి అందించడం మంచిది. నెయ్యి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా నెయ్యి తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.