తులసి గింజలు తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే?

0
117

ప్రకృతిలో వివిధ ఔషధ మొక్కలు ఉంటాయి. ప్రతి ఔషధ మొక్క వల్ల ఏదో ఒక ఆరోగ్య సమస్య తొలగించే స్వభావం తప్పకుండా ఉంటుంది. పాతకాలంలో ఏ వ్యాధి వచ్చిన ఈ ఔషధ మొక్కలే మందుగా ఉపయోగించేవారు. ముఖ్యంగా తులసి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఈ తులసి చెట్టును హిందూవులు పవిత్రంగా పూజిస్తారు. తులసి ఆకులు, తులసి గింజలతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. క్యాన్సర్ కణాల్నిపెరగకుండా చేయడంలో తులసి గింజలు అద్భుతంగా దోహదపడతాయి. తులసి గింజల్ని నిత్యం తీసుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. తులసి గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

తులసి గింజల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్‌‌లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. దానివల్ల అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. చర్మం ముడతల్ని తులసి గింజలు అద్భుతంగా నివారిస్తాయి. దాంతో వృద్దాప్య ఛాయలు తగ్గిపోతాయి. తులసి విత్తనాల్లో ఉండే యాండీ ఆక్సిడెంట్స్ కారణంగా  వృద్ధాప్య ఛాయలు దూరమౌతాయి. అందువల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. తులసి గింజల్లో మనిషి శరీరానికి కావల్సిన పోషకాలు సరైన మోతాదులో లభిస్తాయి.