ఈ రోజుల్లో చాలా మందికి అధిక ఊబకాయం, బరువు పెరగడం, దానిని నియంత్రించుకోలేకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే మారుతున్న ఆహార అలవాట్లు దీనికి ప్రధాన కారణం.ముఖ్యంగా మనం తినే జంక్ ఫుడ్ వల్ల ఈ సమస్య 80 శాతం వస్తోంది అంటున్నారు నిపుణులు. అందుకే ఈ రోజుల్లో చాలా మందికి అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది.
మీ బాడిలో అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే దాన్నిఅధిక కొలెస్ట్రాల్ అంటారు. ఇలా అధిక కొలెస్ట్రాల్ వస్తే గుండెజబ్బులు, స్థూలకాయం సమస్యలు వస్తాయి. కచ్చితంగా మీరు జీవనవిధాన మార్పులు చేసుకోవాలి.
ఆరోగ్యకర డైట్, రోజువారీ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మీరు కచ్చితంగా ఇది తెలుసుకోండి. కొన్ని కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి మంచివైతే, మరి కొన్ని చెడుకు దారి తీస్తాయి. మన బాడీకి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అవసరం. అవకాడోలు, నెయ్యి, కొబ్బరికాయలోవి మంచి కొవ్వులు.
అధిక కొలెస్ట్రాల్ సమస్యకు ఈ ఫుడ్ కారణం
పిజ్జాలు, బర్గర్లు బేకరి ఫుడ్స్ తెల్లటి బ్రడ్,
గోమాంసం, పందిమాంసం, మటన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ మరింత పెరుగుతుంది
చికెన్, సముద్రపు ఆహారం తీసుకోండి
మద్యపానం మానెయ్యండి.