చికెన్ ఇలా తింటే ఆరోగ్యం.. అలా తింటే అనారోగ్యం..

-

చికెన్(Chicken).. ప్రపంచవ్యాప్తంగా ది ఫేవరెట్ డిషెస్‌లో టాప్‌లో ఉంటుంది. ఒక్కొక్కరికి చికెన్ ఒక్కోలా వండితే ఇష్టం. కొందరు చికెన్ బిర్యానీ అంటే ఇష్టడితే మరికొందరు చికెన్ పకోడి, చికెన్ ఫ్రై, చికెన్ లాలీపాప్ ఇలా ఎన్నో రకాలుగా చికెన్‌ను రోజూ లాగించేడానికి రెడీ అంటుంటారు. చికెన్ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్ అందుతుంది కానీ దీనిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. అదే నిపుణులు రోజూ చికెన్‌ను తినడం ఆరోగ్యకరమని కూడా అంటారు. మరి ఇంతకీ చికెన్ ప్రతి రోజూ ఎలా తింటే ఆరోగ్యం.. ఎలా తింటే అనారోగ్యమో తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం రండి తెలుసుకుందాం..

- Advertisement -

ప్రతి రోజూ చికెన్‌(Chicken)ను 100 గ్రాములకు మించకుండా ఉడకబెట్టుకుని, నూనె తక్కువగా వాడి చేసిన రెసిపీస్‌తో తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణుల, ఫిట్‌నెస్‌ కోచ్‌లు కూడా చెప్తున్నారు. కానీ అదే చికెన్‌ను ఇష్టారాజ్యంగా.. ఇష్టమొచ్చినంత తినేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని తాజాగా ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ హెల్గ్ అండ్ రీహాబిలిటేషన్ సైన్సెస్ మెడికల్ డైటెటిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ టేలర్ చేసిన అధ్యయనం కూడా ఒకటి తేల్చి చెప్పింది. ఏదైనా అతి అయితే ప్రమాదం తప్పదని ఈ అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. ప్రతి రోజూ లెక్కాపత్రం లేకుండా చికెన్‌ను లాగించేస్తే.. వారికి మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. దాంతో పాటుగా మన రక్తనాళాల్లో ట్రై గ్లిజరైడ్స్ పేరుకుపోయేలా కూడా చేస్తుందని, దీని వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని అధ్యయనం తెలుపుతోంది.

Read Also: నెలసరి రెండు సార్లు వస్తుందా? దాని అర్థమేంటి?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...