పొట్లకాయ,కోడి గుడ్డును కలిపి తింటే  ఏమవుతుంది ? అస్సలు తినవద్దు ఎందుకంటే 

-

మనం అనేక రకాల ఫుడ్ తింటూ ఉంటాం ,అయితే కొన్ని రకాలు కలిపి తింటే మాత్రం కడుపు నొప్పి వస్తుందని అంతేకాదు అది పాయిజన్ గా మారుతుందని ఇలా తినద్దు అని పెద్దలు ఎప్పటి నుంచో  చెబుతున్నారు….చాలా మంది ఇలా అనేక రకాలు కలిపిన ఫుడ్ తీసుకోరు, ముఖ్యంగా పల్లెల్లో పట్టణాల్లో కర్రీ పాయింట్ల దగ్గర ఇంట్లో ఎక్కడ చూసినా ఎవరైనా సరే చెప్పేది కొడిగుడ్లు పొట్లకాయ కలిపి వండవద్దు అంటారు.. ఇలా వండితే అసలు కూర కూడా తీసుకోరు.
ఇది తింటేప్రాణాలు కూడా పోతాయి అని చాలా మంది అంటారు.. అయితే వైద్యులు ఏమి అంటున్నారు అనేది చూద్దాం  దీని గురించి ….మనం తినే ఆహారాన్ని అరిగించాలి అంటే  మన జీర్ణాశయంలో కొన్ని రకాల ద్రవాలు, యాసిడ్లూ రిలీజ్ అవుతాయి.
ఇలా రిలీజ్ అయిన వాటి వల్ల ఫైబర్ ఫుడ్ మెత్తగా ఉండే ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది, కొన్ని కాస్త సమయం తీసుకుంటాయి.
పొట్లకాయ,కోడి గుడ్డును కలిపి తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయనేది నిజమే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు, ఎందుకు అంటే  కొడి గుడ్డులో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి ఇది అరగడానికి సమయం పడుతుంది. పొట్ల కాయలో నీటి శాతం ఎక్కువ కావడంతో త్వరగా జీర్ణమైపోతుంది. సో ఇలా రెండు విడివిడిగా కాకుండా మిక్స్ అయి ఉండటం వల్ల యాసిడ్ విడుదలై గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | రాజన్న సిరిసిల్లపై ముఖ్యమంత్రి వరాల జల్లు

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాకతో వేములవాడ పట్టణాభివృద్ధి పరుగులు పెట్టడం...

Ponnam Prabhakar | వేములవాడకు చేరుకున్న సీఎం రేవంత్.. భారీ నిధులు ప్రకటించిన మంత్రి

వేములవాడ స్వామి వారి సమక్షంలో ఇచ్చిన హామీని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam...