శరీరానికి ఈజీగా పోషకాలు అందాలంటే మీరు కచ్చితంగా సబ్జా గింజలు తీసుకోండి అంటున్నారు నిపుణులు, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వీటిని ఈ మధ్య బాగా తీసుకుంటున్నారు, నిపుణులు ఇదే తెలియచేస్తున్నారు.న్యూట్రిషనిస్టులు పదేపదే సబ్జా గింజల ప్రయోజనాలను వివరిస్తున్నారు కూడా.
ఎక్కువ ప్రొటీన్, తక్కువ కెలరీలున్న గింజల లిస్ట్ తీసుకుంటే వాటిలో ముందు సబ్జా గింజలకే ఇస్తారు, ఇవి మన దేశంలో బాగానే వాడుతున్నారు, ఇక మీరు నానబెట్టుకుని తింటే చాలా మంచిది పేగుల్లో సమస్యలు ఉండవు, మల బద్దకం ఉండదు, అంతేకాదు ఆకలి అనేది తొందరగా వేయదు. బరువు తగ్గుతారు, నీటిలో 10 గంటలు నానబెట్టి వాటిని తీసుకుంటే చాలా మంచిది.
మీరు నేరుగా తాగకపోయినా వీటిని ఫలూదా, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, మజ్జిగ, పలు స్వీట్లలో ఈ గింజలు తీసుకోవచ్చు,
ఫైబర్ పుష్కలంగా వీటిలో ఉంటుంది..బ్లడ్ షుగర్ అదుపుచేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది, ఇక షుగర్ సమస్య ఉన్న వారు వీటిని వాటర్ లో వేసి తీసుకోవచ్చు..సబ్జా గింజల్లో మినరల్స్ అధికంగా ఉంటాయి.. సో అందుకే మీ ఫుడ్ లో వీటిని వారానికి రెండు మూడుసార్లు అయినా తీసుకోండి..