ఆనందయ్య మందులో వాడే తిప్పతీగతో ఇవీ లాభాలు : డాక్టర్ మంతెన

tippa teega anandhaiah covid medicine anandhaiah medicine dr manthena satyanarayana raju

0
106

తిప్ప తీగ అనే ఆకు మానవాళికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని అపారంగా పెపొందించడంతోపాటు షుగర్ లాంటి వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేకూరుస్తున్నది. తిప్పతీగను తాజాగా కృష్ణ పట్నం ఆనందయ్య తయారు చేస్తున్న కోవిడ్ మందులోనూ విరివిగా వాడుతున్నారు. ఇలాంటి ఔషధ గుణాలు దండిగా ఉన్న తిప్ప తీగ వల్ల లాభాలేంటో ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ ఒక వీడియోలో వివరించారు.  ఆయన మాటల్లోనే…

 

పల్లెటూర్లలో తిప్పతీగను చాలా సందర్భాల్లో వాడుతున్న తీరును మనం చూస్తున్నాం. తాతల నుంచి తండ్రుల వరకు, తండ్రుల నుంచి నేటి వరకు తిప్పతీగను వాడుతున్నారు. ఖాదర్ వలీ కూడా చెప్పుతున్నారు తిప్పతీగను వాడాలని. కషాయం కూడా చేసుకుని తాగుతున్నారు.

 

తిప్పతీగ గురించి సైంటిఫిక్ స్టడీ ఒకటి చెప్పబోతున్నాను. 170 పరిశోధనా పత్రాల సారాంశాన్ని మనకు అందించినవారు లక్నోలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ వారు 2016లో అందించారు.

 

తిప్పతీగ ద్వారా ఇమ్యూనిటీ గురించి ప్రస్తావించారు. 35 రకాల కెమికల్స్ తిప్పతీగలో ఉన్నాయి. 15 రకాల ఆల్కటైల్స్ (Alkaloids), 6 రకాల గ్లైకోసైడ్స్ (glycosides),  5 రకాల డైటర్ పెనాయిడ్స్ (Diterpenoids) 4 రకాల స్టిరాయిడ్స్ (steroids),  5 రకాల ఆలి ఫ్యాక్టిక్ కంపౌండ్స్ (aliphaci compounds) ఇన్ని రకాల రక్షణ వ్యవస్థలు కలిగి ఉన్నాయి.

 

రక్షక దళాలైన తెల్లరక్తకణాల యొక్క స్థితిగతులను మెరుగుపర్చేందుకు బ్రహ్మాండ్లంగా ఉపయోగపడుతుంది. మానవ రక్షణ వ్యవస్థలో భాగంగా మ్యాక్రోఫేస్ కణాలు మన శరీరంలోకి ఉంటాయి.  వైరస్ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరగానే ఇవి అమాంతం మింగేస్తాయి. అయితే వీటిమీద వైరస్ దాడి చేయకుండా లైసోజోమ్స్ అడ్డుకుంటాయి. తిప్పతీగ ఈ లైసోజోమ్స్ ను పెంపొందిస్తుంది. తద్వారా బ్యాక్టీరియా మాడిమసైపోవడానికి ఉపయోగపడుతుంది.

 

వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు టి హెల్పర్ సెల్స్ అనేవి  సమాచారం బాగా ఇస్తాయి. రక్షణ వ్యవస్థను మేల్కొల్పుతాయి. టి హెల్పర్ సెల్స్ అనేవి పోలీసుల మాదిరిగా గస్తీ కాస్తుంటాయి. తిప్ప తీగ టి హెల్పర్ సెల్స్ సంఖ్యను పెంచేందుకు ఉపయోపడుతుంది.

 

మన శరీరంలో బి సెల్స్ యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ బి సెల్స్ బాగా పనిచేసి యాంటీ బాడీస్ ను బాగా ఉత్పత్తి చేయడానికి తిప్పతీగ పనికొస్తది. అలాగే యాంటీ బాడీస్ బాగా పనిచేయడానికి అవసరమైన ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేయడానికి తిప్ప తీగ పనికొస్తది.

 

సో తిప్ప తీగ వల్ల ఒక్క కరోనా మాత్రమే కాదు… హానికారమైన ఏ బ్యాక్టీరియాను సైతం దరిచేరనీయదని చెప్పవచ్చు. తిప్పతీగను మన ఇంట్లో ఎలా ఉపయోగించుకోవాలో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఆర్టికల్ కింద ఉంది చదవండి…

 

ఆనందయ్య మందులో వాడే తిప్పతీగను మనం ఇంట్లోనే ఎలా వాడాలి ?

ఆనందయ్య మందులో వాడే తిప్పతీగను మనం ఇంట్లోనే ఎలా వాడాలి ?