మురళీ శర్మ రియల్ స్టోరీ – బాలీవుడ్ టు టాలీవుడ్

Actor Murali Sharma Real Story

0
35

మురళీ శర్మ తెలుగులో ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విలక్షణ నటుడు. ఇక ఆయన చేసిన రోల్స్ ప్రతీది కూడా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1972 ఆగస్టు 9 న ఆయన జన్మించారు. ఆయన మన తెలుగు వారే .ఆయన తండ్రి పేరు వృజు భూషణ్, అమ్మ పద్మ. వీళ్ళ అమ్మగారిది గుంటూరు. తండ్రి వ్యాపారరీత్యా ముంబయిలో స్థిరపడ్డారు.

ఆయన అక్కడే పుట్టి పెరిగారు. చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇంట్రస్ట్. ఇక అలా నాటకాల్లో ప్రవేశించారు. డిగ్రీ అయ్యాక టెలిఫోన్ ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్, పార్ట్ టైమ్ జర్నలిస్ట్గా ఉద్యోగాలు చేశారు. సినిమాల్లో నటించాలి అనే కోరికతో రోషన్ తనేజా ఇన్స్టిట్యూట్లో చేరారు. అక్కడ కొద్ది నెలలు శిక్షణ తీసుకున్నారు మురళీశర్మ.

అక్కడే దీపక్ తిజోరి, విక్రమ్భట్లతో పరిచయం ఏర్పడింది. వాళ్లు నిర్మించిన టీవీ సీరియల్స్లో నటించాడు. తర్వాత హిందీ చిత్రం రాజ్ లో అవకాశం వచ్చింది.ఆ తర్వాత షారుఖ్ఖాన్ మైహూనా లో నటించారు.ఇక తర్వాత తెలుగులో దర్శకుడు సురేందర్రెడ్డికి మక్బూబ్, అపహరణ్, బ్లాక్ఫ్రైడే సినిమాల్లో ఆయన నటన నచ్చి ఈ చిత్రంలో తీసుకున్నారు. అలా ఆనాటి నుంచి ఇప్పటి వరకూ అనేక చిత్రాల్లో నటించారు.