ఒమిక్రాన్ రహస్య వేరియంట్ ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలంటే..

0
43

ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుంది. రోజురోజుకు ఈ వేరియంట్ చాపకింది నీరులా వ్యాపిస్తుంది. అయితే ఒమిక్రాన్ ను ఎలా కనిపెట్టాలి. అసలు ఒమిక్రాన్ రహస్య వేరియంట్ అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం..

ఒమిక్రాన్ ను రెండు విధాలుగా గుర్తించవచ్చు. ఒకటి ఆర్టీపిసిఆర్, రెండవది జెనెటిక్ సీక్వెన్సీస్. అయితే అన్ని ఆర్టీపిసిఆర్ పరీక్షల్లో ఒమిక్రాన్ ను గుర్తించలేం. కొన్ని ఆర్టీపిసిల్లొ ఎస్జిన్ ను పరీక్షిస్తారు. ఎన్జిన్, ఓఆర్ఎఫ్జీన్, ఎస్జీన్ ఈ మూడు పరీక్షలు చేసినప్పుడు ఎన్జిన్, ఓఆర్ఎఫ్జీన్ పాజిటివ్ వచ్చి ఎస్జీన్ నెగెటివ్ వస్తే దాన్ని ఎస్జీన్ టార్గెట్ ఫెయిల్యూర్ అంటారు. అయితే అది ఒమిక్రాన్ అయ్యే అవకాశం ఉంటుంది.

కానీ ఒమిక్రాన్ లో కొన్ని సబ్ వేరియెంట్స్ ఉంటాయి. BA1, BA2, BA3 ఉంటాయి. దీంట్లో BA2 వేరియంట్ ఉన్నప్పుడు ఆర్టీపిసిఆర్ టెస్ట్ చేసినప్పుడు ఎస్జీన్ కూడా పాజిటివ్ వస్తుంది. అంటే ఎస్జీన్ టార్గెట్ ఫెయిల్యూర్ ఉండదు. కాబట్టి వీరికి మూడు జీన్స్ పాజిటివ్ ఉంటాయి కాబట్టి ఒమిక్రాన్ కాదేమో అనుకుంటాము. కానీ వీరికి ఒమిక్రాన్ ఉంటుంది. దీన్ని రహస్య వేరియంట్ అని అంటారు.