థైరాయిడ్ సమస్య ఎలా గుర్తించాలి ?  థైరాయిడ్ సమస్య ఉంటే ఈ ఫుడ్ తినొద్దు

0
28

ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య ఉంది అనిపిస్తే వెంటనే వైద్యులని అప్రోచ్ అవ్వాలి . ఆలస్యం చేయడం వల్ల తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తాయి అంటున్నారు వైద్యులు. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ మన శరీరానికి చాలా ముఖ్యమైంది. ఇది కణాలను రిపేర్ చేయడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ మెడ దగ్గర ఉంటుంది.

 శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు హైపోథైరాయిడిజం, అధికంగా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం సంభవిస్తుంది. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పురుషుల్లో కూడా కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంది.

 అయితే ఎలా ఈ థైరాయిడ్ సమస్య గుర్తించాలి అంటే ?

 ఒక్కసారిగా మీరు  బరువు పెరుగుతుంటే

గొంతులో వాపు వస్తున్నట్లు అయితే

జుట్టు రాలడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తే మీరు వెంటనే వైద్యులని సంప్రదించండి.

 ఈ ఆహారాలను మాత్రం థైరాయిడ్ రోగులు ఎప్పుడు తినకూడదు

  1. క్యాబేజీ, కాలీఫ్లవర్ 
  2. కెఫీన్ ఉండే పదార్దాలు అందుకే కాఫీ, టీ తాగవద్దు
  3. 3.సోయాబీన్ 
  4. మటన్ వీటికి దూరంగా ఉండాలి.