వంటకు ఏ రకం నూనె వాడడం మంచిది?

0
96

నూనె లేకుండా వంట సాధ్యం కాదు. మార్కెట్లో రకరకాల నూనెలుఅందుబాటులో ఉన్న..వంటకు ఏ నూనె వాడితే మంచిదనే విషయం తెలియక  మహిళలు సతమతమవుతుంటారు. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను చెక్ పెట్టాలంటే మనం తీసుకునే నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మార్కెట్లో దొరికే సన్‌ ఫ్లవర్‌, వేరుశెనగ, సోయాబీన్‌ మొదలైన రిఫైన్ట్‌ నూనెలు తగుమోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ నూనెలు రిఫైనింగ్‌ చేసేటప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చెయ్యడం, కొన్ని రకాల రంగు, రుచి, వాసనను ఇచ్చే పదార్థాలు తొలగించడం చేస్తారు.

దీనివల్ల రిఫైన్ట్‌ నూనెలు ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండడమే కాక ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. వివిధ రకాల గింజల నుండి వచ్చే నూనెల్లో వివిధ రకాల ఫాటీఆసిడ్స్‌ ఉండడం వల్ల మనం ఏదో ఒక్క నూనెను మాత్రమే ఎల్లప్పుడూ వాడడం కాకుండా ప్రతి రెండు నెలలకోసారి నూనెను మార్చుకుంటే బాగుంటుంది.