తెలంగాణలో ఆరా సంస్థ ఎన్నికల సర్వే..గెలుపు ఏ పార్టీదంటే?

0
37

ఆరా సంస్థ ఎన్నికల సర్వేపై సీఎం రిపోర్ట్ ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ఆరా సంస్థ అధినేత ఆరా మస్తాన్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయాన మాట్లాడుతూ..పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరా సంస్థ సీఎంకు రిపోర్ట్ ఇచ్చాడని మాట్లాడాడు.. కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా..

రేవంత్ రెడ్డికి సమాచార లోపం ఉంది..చాలా రోజుల క్రితం నుంచే టిఆర్ఎస్ కు మేము పని చేయడం లేదు. ప్రతి 3 నెలలకు ఓకసారి..మూడో వంతు నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నాం. గత సంవత్సర కాలంలో 119నియోజకవర్గాల్లో సర్వే చేసాం.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..టిఆర్ఎస్ కు 38.88శాతం ,బీజేపీ కి 30.48 , కాంగ్రెస్ కు 23.71,ఇతర 6.91శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది..

ఆదిలాబాద్ ,నిజామాబాద్ ,కరీంనగర్ లలో టిఆర్ఎస్ 39.07,బీజేపీ 35.69కాంగ్రెస్ 18.91ఇతరులు6.31శాతం

మెధక్ ,మహబూబ్ నగర్ లలో టిఆర్ఎస్ 40.89, బీజేపీ 30.37,కాంగ్రెస్ 23.38,ఇతరులు 5.34

హైదరాబాద్ ,రంగారెడ్డి..టిఆర్ఎస్ 40.43 ,బీజేపీ35.32 ,కాంగ్రెస్16.33,ఇతరులు 7.92

వరంగల్ ,ఖమ్మం ,నల్లగొండ లో టిఆర్ఎస్ 35.14, బీజేపీ 20.54,కాంగ్రెస్ 39.22,ఇతరులు 8.10

హుజురాబాద్ ఫలితాలను ముందే ఖచ్చితంగా చెప్పాం. ఏపీలో వైఏస్సాఆర్ సీపీ గెలుస్తుందని కూడా ముందే చెప్పాం..

2018అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 5 శాతం ఓటు శాతం కోల్పోతుంది..

2018 తో పోల్చితే..పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 4.72 శాతం ఓట్లు కోల్పోయింది..

2018తో పొల్చితే..పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 23.5శాతం అధిక ఓట్ల ను పొందనుంది..

జీహెఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటు శాతం తగ్గింది.. అదే సమయంలో బీజేపీకి ఓటు శాతం పెరిగింది.. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చాలా తగ్గింది.

వరంగల్ కార్పోరేషన్ లో టిఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల తో పోలిస్తే..కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటు శాతం తగ్గింది.. ఇక్కడ కూడా బీజేపీ ఓటు శాతం పెరిగింది..

5 రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ పై పడింది.

హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లా లో 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 3స్థానంలో ,8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 4స్థానంలో ఉంది..

ఖమ్మం, నల్లగొండ ,వరంగల్ లో టిఆర్ఎస్ ,కాంగ్రెస్ మధ్య పోటీ.

మెధక్, మహబూబ్ నగర్ లలో త్రిముఖ పోటీ ఉంటుంది..

ఆదిలాబాద్ ,నిజామాబాద్ ,కరీంనగర్, హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాలో ప్రధాన పోటీ టిఆర్ఎస్, బీజేపీ మధ్యే..

కేసీఆర్ కుటుంబ పాలనే ప్రతిపక్ష పార్టీలకు అస్ర్తంగా మారనుంది.

రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది.

కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ లో చేరడం వల్ల.. టిఆర్ఎస్ ను కాంగ్రెస్ ఢి కొట్టలేదనే భావన ప్రజల్లో ఏర్పడింది.

టిఆర్ఎస్ ను బీజేపీ ఢీ కొట్టగలదనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది.

ఆంధ్రా సెటిలర్స్ ..కాంగ్రెస్ వైపు మొగ్గు

నార్త్ ఇండియా ఓటర్లు.. బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు..

టిఆర్ఎస్ కు 87స్థానాల్లో,కాంగ్రెస్ కు 53,బీజేపీకి 29 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు..