దేశ వ్యాప్తంగా ప్రజలు కరోనా టీకా తీసుకుంటున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత చాలా మందికి జ్వరం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. టీకా తీసుకుంటే మనకు ఎందుకు ఇలా అవుతుంది అంటే, వైద్యులు దీనిపై ఓ విషయం తెలియచేస్తున్నారు.
టీకా తీసుకోవడం వల్ల మనకు చాలా మంచిది. అయితే కరోనా టీకా తీసుకున్న తర్వాత, మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పునరుత్తేజితం అవుతుంది. అందుకే ఈ జ్వరం -నొప్పులు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
మనం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే తెల్ల రక్తకణాలు ప్రక్రియ ప్రారంభిస్తుంది. దీని వల్ల జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. దీని వల్ల ఎలాంటి ఆందోళన కంగారు పడాల్సిన పనిలేదు. అయితే యువతలో చాలా మంది కరోనా టీకా తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు .దీనికి కారణం యువతలో ప్రతిస్పందన ఎక్కువగా ఉంటుంది. అందుకే యువతలో టీకా తీసుకున్న తర్వాత జ్వరం, తలనొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే నాలుగు రోజులు అయినా ఈ లక్షణాలు తగ్గకపోతే ఓసారి ఆస్పత్రికి వెళ్లడం మంచిది.