బాదం పప్పును పొట్టుతో తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?

-

బాదం పప్పు(Almonds)తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యమనే చెప్పాలి. అదే విధంగా బాదం పప్పును పొట్టు తీసేసిన తర్వాతనే తినాలా? పొట్టుతో తింటే ఏమవుతుంది? అన్నది కూడా అనేక మంది మదిలో మెదులుతూ సమాధానం అర్థంకాక వారిని అయోమయంలో పడేస్తున్న ప్రశ్న కూడా. దీనికి ఎంతో మంది సమాధానం చెప్తున్నా.. ప్రతి రోజూ ఇదే ప్రశ్నతో చాలా మంది సతమతమవుతుంటారు. మరి ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం కూడా అంతే చిక్కుచిక్కుగా ఉంది. బాదం పప్పును పొట్టుతో తినొచ్చు. తినకూడదు కూడా. కాకపోతే కొందరు తినొచ్చు.. కొంతమంది తినకూడదు. ఇది వారి శరీర ధర్మాన్ని బట్టి కాదు.. వారి వయసు బట్టి నిర్దేశించబడుతుంది. సాధారణంగా నానబెట్టిన బాదంపప్పును పొట్టు వలిచి తింటే అందులోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయన్నది పాత మాట.. పొట్టుతో కలిసి తింటే మరెన్నో లాభాలు ఉంటాయన్నది కొత్త మాట.

- Advertisement -

నానబెట్టిన బాదం పప్పు పొట్టులో టానిన్ అనే పదార్థం అధికంగా వచ్చి చేరుతుంది. అందుకే పొట్టును తీసేసి తినాలని అంటారు. కానీ ఆ పొట్టులో విటమిన్ ఇ, పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. అయితే యుక్త వయసు వారు బాదం పప్పు(Almonds)ను పొట్టుతో సహా తినేయొచ్చని, వృద్ధులు, చిన్నారులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు మాత్రం తప్పకుండా పొట్టు వలిచి తినాలని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా వృద్ధులు, చిన్నారులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు తింటే పొట్టును వారికి మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. జీర్ణ ప్రక్రియను మరింత దెబ్బతీస్తుందని నిపుణులు చెప్తున్న మాట.

Read Also: స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ వార్త మీకోసమే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...