Winter:ఉష్.. ఉక్కగా ఉందంటూ.. ఫ్యాన్లు హైస్పీడ్ పెట్టే రోజులు ఇక పోయాయి. అబ్బా చలి ఫ్యాన్ ఆపేయండి అన్న రోజులు వచ్చేశాయి. అదేనండి గజగజలాడించే చలికాలం(Winter) వచ్చేసింది. ఇక బీరువాల్లో, వార్డురోబ్‌లలో అడుగున పెట్టేసిన స్వెట్టర్లు దులిపి.. ధరించే రోజులు వచ్చేశాయన్నమాట. చలికాలం చాలా అందంగా ఉంటుంది.. కాని కొన్ని చిక్కులు కూడా ఉంటాయి, వాటికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం రండి.
వింటర్ స్టార్ట్ అయ్యిందంటే మెుదటిగా వచ్చే ఇబ్బంది.. శరీరం, పెదవులు పొడిబారటం. దీనిని నుంచి శరీరాన్ని రక్షించుకోవాలంటే.. మీ శరీరతత్వానికి సరిపడే మంచి బాడీ లోషన్స్, వాజిలెన్ ఇంట్లో పెట్టేసి, రోజూ వాడటం, లిప్‌బామ్‌లు వాడటమే పరిష్కారం. కొంచెం సమయం వెచ్చించగలం అనుకుంటే, స్నానం చేసి నీటిలో, మూడు నాలుగు చుక్కల కొబ్బరి నూనె వేయండి.. నేచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.ఇక తరువాత విషయానికి వచ్చేస్తే.. జుట్టు చిట్లడం. ఈ సమస్య ముఖ్యంగా మహిళలలో చూస్తాం.
ఈ కాలంలో జుట్టును వదులుగా, జాలువారుగా వదిలేయకుండా, అల్లుకొని జడవేసుకోవటం ఉత్తమం. జుట్టుకు నూనె రాయటం ద్వారా, చిట్లకుండా చూసుకోవచ్చు.చలికాలం(Winter) వచ్చాక, త్వరగా అనారోగ్య బారిన పడుతుంటారు. త్వరగా జలుబు, జ్వరాలు వచ్చేస్తుంటాయి. గోరు వెచ్చని నీరు తాగటం, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండటం చేయాలి. బయట ఫాస్ట్ ఫుడ్స్ నోరూరిస్తూ ఉంటాయి, కానీ వాటి జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. సిట్రస్ జాతి పళ్లను తీసుకోవటం ద్వారా, శరీరానికి తగు రోగనిరోధక శక్తిని పెంచే విటమన్ దొరుకుంది. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి.. వింటర్‌ను ఎంజాయ్ చేయండి.