Dry Skin: చర్మం పొడిబారుతుందా.. ఈ చిట్కాలు పాటించండి!

-

Winter tips for Dry skin care: చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారటం, పగుళ్లు, రావటం సహజం.. చర్మం పొడిబారి దురద, బిగుతుగా మారుతుంది. చివరికి ఇది చర్మం ముడతలు పడేందుకు దారితీస్తుంది. అటువంటప్పుడే, చర్మానికి అదనపు సంరక్షణ అవసరమని గుర్తించుకోండి. మరి అయితే ఈ శీతాకాలంలోనూ మీ చర్మం పొడిబారకుండా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి.

- Advertisement -

మాయిశ్చరైజర్‌
చర్మాన్ని మాయిశ్చరైజర్‌గా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. మామూలు సబ్బులు చర్మంపై ఉన్న సహజ నూనెలను పూర్తిగా తొలగించేస్తాయి. దీనికారణంగా చర్మం మరింత పొడిబారి, పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల సబ్బురహిత క్లెన్సర్లను వాడటం మెుదలుపెట్టండి. స్నానం తరువాత చర్మాన్ని మాయిశ్చరైజ్‌గా ఉంచేందుకు వివిధ రసాయన సమ్మేళన ప్రొడక్టులు వాడే బదులు.. కొబ్బరి నూనె వాడటం ఎంతో ఉత్తమం. స్నానం చేసే నీటిలో రెండు నుంటి ఐదు చుక్కల కొబ్బరి నూనెను వేసి.. ఆ నీటితో స్నానం చేయండి.. శరీరం స్మూత్‌గా ఉంటుంది. కానీ కొబ్బరి నూనెతో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్‌లో జారే ప్రమాదం ఉంటుంది కాబట్టి, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

వేడివేడి నీళ్లు స్నానం వద్దు
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది చేసే తప్పు ఏంటంటే పొగలు కక్కే వేడివేడి నీళ్లు స్నానం చేస్తారు. దీనివల్ల చర్మం డీ హైడ్రేట్‌ అవుతుంది. అంతేగాక చర్మం కమిలిపోయే ప్రమాదం ఉంది. ఈ వేడి నీరు చర్మంపై ఉండే సహజ నూనెలను తొలగించేయటంతో.. చర్మం మరింత పొడిబారిపోతుంది. గోరు వెచ్చని నీటితో ప్రతిరోజూ కేవలం 5-10 నిమిషాలు స్నానం చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువ సేపు స్నానం చేసినా.. చర్మం పొడిబారే అవకాశం ఉంది. అలాగే, డియోడరెండ్‌ సబ్బులు, పెర్ఫ్యూమ్‌ సోప్స్‌, ఆల్కహాల్‌ ఉత్పత్తులను చలికాలంలో వాడకపోవటమే ఉత్తమం. స్నానం చేసిన వెంటనే.. మాయిశ్చరైజర్‌ మాత్రం తప్పకుండా శరీరానికి అప్లై చేయటం మరిచిపోకూడదు.

మరికొన్ని చిట్కాలు
ఉన్ని దుస్తులు ఈ కాలంలో విరివిగా ధరిస్తూ ఉంటాము కానీ.. ఉన్న చర్మానికి కాస్త చికాకు కలిగిస్తుంది. కాబట్టి, బయటకు వెళ్లేటప్పుడు తప్పితే, ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న దుస్తులు వేసుకోకపోవటం మంచిది. చలికాలం అయినా, సన్‌స్క్రీన్‌ లోషన్‌ అప్లై చేయాలి. ఈ కాలంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని ఎక్కువ చూపిస్తాడు కానీ.. చలి ప్రభావం కారణంగా తేడా తెలియదు. అందువల్ల సన్‌స్క్రీన్‌ లోషన్‌ విరివిగా వాడుతూ ఉండాలి. షేవింగ్‌ చేసుకునే ముందు, షేవింగ్‌ క్రీమ్‌ లేదా జెల్‌ను ముఖానికి రాసిన కొంతసేపటి తరువాతే షేవ్‌ చేయండి. దీనివల్ల చర్మం (Dry skin)  అంతగా బాధపెట్టదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...