స్త్రీలలో PCOD సమస్య ఎందుకు వస్తుంది ? అమ్మాయిలు తప్పక తెలుసుకోండి

స్త్రీలలో PCOD సమస్య ఎందుకు వస్తుంది ? అమ్మాయిలు తప్పక తెలుసుకోండి

0
128

ఈరోజుల్లో ఎక్కడ విన్నా చాలా మంది మహిళలు చెప్పే సమస్య పీసీఓడీ..పాలిసిప్టిక్ ఓవరీస్ డిసీజ్ , అయితే చాలా మంది మహిళలకు అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది తెలియదు, నిపుణులు చెప్పుతున్నదాని ప్రకారం ఈ ప్రాబ్లమ్ కు కొన్ని కారణాలు చెబుతున్నారు, ముఖ్యంగా ఇది 15 నుంచి 35 సంవత్సరాలలోపు మహిళలు ఎక్కువగా కనిపిస్తోంది.

జీవన విధానం సరిగా లేకపోవటం, వ్యాయామం చేయక పోవడం, జంక్ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశముంది.ప్రపంచంలో 20 శాతం మంది మహిళలు పీసీఓడీ సమస్యతో సతమతమవుతున్నారు.మన భారత దేశంలో కూడా ఈ సమస్య చాలా మందిలో ఉంది.

ఇక అమ్మాయిలకు ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత. హార్మోన్లు పెరిగిపోవడం, కావాల్సిన హార్మోన్లు తగ్గిపోవడం జరుగుతుంది. దీని వల్ల స్త్రీలకు అండాశయాల్లో నీటి బుడగల లాంటి సిస్టిలు ఏర్పడతాయి.
అయితే బరువు ఎక్కువగా ఉన్న మహిళల్లో ఈ సమస్య ఉంటుంది..డయాబెటిస్, హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్న వారికి పీసీఓడీ వచ్చే అవకాశం ఉంది.

వీరు అసలు బరువు పెరగకూడదు, జంక్ ఫుడ్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ వంటివి తినకూడదు, పీచు పదార్దాలు తినాలి, ఫ్రూట్స్ తినాలి,శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి, ఇక కొందరికి పిరియడ్స్ సరిగ్గా రావు లేట్ అవుతూ ముందు వస్తూ ఉంటుంది, ఇలాంటి సైకిల్ ఉంటే ముందే గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి.