స‌న్న‌గా ఉన్నారని బాధపడుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి..

0
99

మ‌న‌లో కొంతమంది అధిక బ‌రువు ఉన్నామని బాధపడితే..మరికొందరు బ‌రువు త‌క్కువ‌గా ఉన్నామని తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఉండాల్సిన బ‌రువు క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల అనేక ర‌కాల రోగాల బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రువు త‌క్కువ‌గా ఉండ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి.

వాటిలో ముఖ్యంగా..స‌రైన పోష‌కాహారం లేక‌పోవ‌డం, ఆహారాన్ని తీసుకున్నా కూడా శ‌రీరానికి ప‌ట్ట‌క‌పోవ‌డం, థైరాయిడ్ ఎక్కువ‌గా ఉండ‌డం వల్ల  చాలా మంది బ‌రువు త‌క్కువ‌గా ఉంటారు. బరువు తక్కువగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే చాలా సులభంగా, ఆరోగ్యంగా బ‌రువు ఎలా పెర‌గాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మ‌న‌కు ప్ర‌తిరోజూ 2000 క్యాల‌రీల శ‌క్తి అవ‌స‌ర‌మ‌వుతుంది.  బ‌రువు పెర‌గాల‌నుకునే వారు ఇంత కంటే ఎక్కువ క్యాల‌రీల‌ను అందించే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు పెరగటానికి అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాలతో పాటు  పాల నుండి ఉత్పత్తి అయ్యే చీస్, పెరుగు వంటి పదార్దాలు శరీర బరువును పెంచుతాయి. అలాగే లావు కావాలనుకునే వారికి రోజుకు ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. రోజుకు సరిపడా నిద్రపోవడం వల్ల లావు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.