జుట్టు పెరగడం లేదని బాధపడుతున్నారా? ఇలా చేస్తే వద్దన్నా పెరుగుతుంది..

0
112

ఈ మధ్యకాలంలో జుట్టు రాలిపోవడం, జుట్టు పెరగకపోవడం వంటి సమస్యలు చాలామంది మహిళలను బాధపెడుతోంది. మహిళలు ఎవ్వరైనా జుట్టు పొడువుగా, ఒత్తుగా ఉండాల‌ని ఆశ పడుతుంటారు. కానీ మనం ఎన్ని రకాల నూనెలు, షాంపూలు మార్చిన కూడా అనుకున్న మేరకు ఫలితాలు లభించవు. అందుకే ఈ సింపుల్ చిట్కా పాటించి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

మనందరికీ అందుబాటులో ఉండే ఉల్లిపాయతో ఎలాంటి జుట్టు సమస్యలకైనా వెంటనే చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా జుట్టు పొడువుగా, ఒత్తుగా పెరగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక  ఉల్లిపాయను తీసుకొని చుట్టూ ఉన్న పొట్టు తీసి నీటి తడి అనకుండా మిక్సీలో పేస్ట్ ల తాయారు చేసుకోవాలి.

అనంతరం ఆ పేస్ట్ లో ఉండే జ్యూస్ ను వ‌స్త్రం స‌హాయంతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఒక గుండ్రని దూదిని తీసుకొని గిన్నెలో ఉన్న జ్యూస్ లో ముంచి తలకు బాగా పట్టించాలి. అనంతరం ఉల్లిపాయ పేస్టును కూడా జుట్టుకు పట్టించి గంట తర్వాత తలస్థానం చేస్తే మంచి ఫలితాలు లభించడంతో పాటు ఎలాంటి జుట్టు సమస్యలైనా తొలగి పోతాయి.