వేలకు వేలు ఖర్చు పెట్టనక్కర్లేదు..ఈ సింపుల్ ట్రిక్స్‌తో చుండ్రుకు చెక్ పెట్టండిలా..

0
32
Dandruff in the hair. Flaky scalp. Seborrhea. Macro shot. Children's dandruff. Seborrheic dermatitis. Scales on the scalp and on the hair. ; Shutterstock ID 1019564692; Purchase Order: 4501307535; Job: B318O-005842-00; Client/Licensee: P&G

ఈ రోజుల్లో చుండ్రు సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. దాంతో చండ్రును వదిలించుకోవడానికి ప్రతి ఒక్కరూ వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. ఇంట్లో దొరికే పదార్ధాలతో సులభంగా తయారు చేసుకునే కొన్ని హెయిర్ మాస్క్‌లు వాడి ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి..

మొదటి చిట్కా: మొదటగా గిన్నెలో 1 నుంచి 2 స్పూన్ల కలబంద జెల్ తీసుకుని, దీనికి 8 నుండి 10 చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ జోడించాలి. ఆ తరువాత ఈ రెండింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

రెండవ చిట్కా: గిన్నెలో 2 నుంచి 3 చెంచాల వేపనూనె తీసుకుని, దానికి నిమ్మరసం జోడించి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల వరకు అలాగే ఉంచుకుని ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 1 నుంచి 2 సార్లు చేయాలి.