Holi Colours |హోలీ రోజు ఏ రంగులు చల్లుకుంటే మంచిదో తెలుసా

హోలీ రోజు ఏ రంగులు చల్లుకుంటే మంచిదో తెలుసా

0
205
Holi Colours

Holi Colours |హోలీ జరుపుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి, అలాగే ప్రకృతితో మనకు అన్నీ ముడిపడి ఉన్నాయి, ఇది కూడా అలాంటి పండుగ అనే చెప్పాలి. వసంత కాలంలో వాతావరణములో మార్పులు జరగటం వల్ల వైరల్ జ్వరం, జలుబు వస్తాయని ప్రజలు నమ్ముతారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని హోలీరోజు పసుపు ఇలాంటివి చల్లుకుంటారు.

సంప్రదాయ రంగులైన నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.తడిగా ఉండే రంగుల కోసం, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది.

Holi Colours |అయితే ఇలా కాకుండా పసుపు కుంకుమ సిందూరం ఆకుపచ్చని రసాలు ఇలాంటి వాటితో హోలీ జరుపుకుంటే మంచిది అని చెబుతున్నారు పండితులు, రంగుల పండుగ విందుని కూడా చాలా మంది ఉల్లాసంగా జరుపుకొంటారు. ఆ రోజు చాలా వరకూ తెల్లని దుస్తులను ధరించి బయటికి వస్తారు, ఏ ప్రదేశములో అయితే ఆడాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలోకి అందరూ వచ్చి ఉల్లాసంగా గడుపుతారు.

Read Also: