(శ్రీనివాస్, జర్నలిస్ట్, ధరిపల్లి గ్రామం నుంచి)
శివాలయంలో ద్వజస్తంభన ప్రతిష్టాపన
ప్రారంభమైన ఉత్సవాలు
ఉత్సవాలకు హాజరుకానున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
కొంగుబంగారంగా మారిన ఈశ్వరుడు
మూడు రోజుల పాటు ఉత్సవాలు
ఈనెల ఏడవ తేదీన బుధవారం రోజున మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి గ్రామంలోని శివాలయంలో శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహంతో పాటు ధ్వజస్తంభ పునః ప్రతిష్ట జరగనుంది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివాలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారని ఉత్సవ కమిటి తెలిపింది. రంగంపేట మాధవానందస్వామి దివ్య ఆశ్సీసులతో… వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతన్నాయి. సోమవారం నాడు అంగరంగ వైభంతో ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన సోమవారం ఉదయం నుండి గణపతి పూజ, పుణ్యహావచనము, ఆఖండ దీపస్థాపన, బుత్విక్ వర్ణం, సర్వతో భద్ర, క్షేత్రపాలక, యోగిని, వాస్తూ, నవగ్రహా స్థాపన, జలధివాసం, మంగళహారతి, మంత్రపుష్పంతో పాటు సాయంత్రం ఆగ్ని ప్రతిష్ట జరిగాయి.
మంగళవారం రోజున కలశ స్నపనం, ఆవాహిత దేవాతా పూజలు, జలధివాసంగ, మూలమంత్ర, పంచసూక్త రుద్ర హవనములు సాయంత్రం ధాన్య, శయ్య, ఫల, పుష్ప, హిరణ్యాధి వాసములు, మంగళ హారతి, మంత్రపుష్పం పూజులు జరుగుతాయి. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం రోజున ఉదయం నుండి గర్త ప్రాసాద సంస్కారములు, రోహిణి నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నము నందు ఉదయం 11-45 నిమిషాలకు శివాలయం ప్రాకరంలో గల శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క నూతన యంత్ర విగ్రహ ప్రతిష్ట, ద్వజస్తంభన ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, దృగ్బలి మహాపూర్ణాహుతి, షోడషోపచార పూజ, మంగళ హారతి పూజలు ఉంటాయని కమిటి వెల్లడించింది. ఈ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటి కోరింది. చివరి రోజున పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం ఉంటుంది.
ఉత్సవాలకు హాజరుకానున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
ధరిపల్లి శివాలయంలో జరిగే ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ సలహాదారుడు, స్థానిక ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు బుధవారం జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారని కమిటి తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా పేరుగడించిన ధరిపల్లి
ఈ శివాలయంలో దాదాపు 500 సంవత్సరాల నుండి విశేష పూజలు జరుగుతున్నాయి. అనతి కాలంలో విశిష్టమైన పేరు ప్రఖ్యాతలు గడిచింది ఈ దేవాలయం. ప్రతి సోమవారం, శనివారం విశేష పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి. చూట్టు ప్రక్కల గ్రామాల నుండే కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పొరుగు జిల్లాలు నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డితో వివిధ జిల్లాల నుండి భక్తుల తాకిడి ఉంది. అలాగే ఈ గ్రామం నుంచి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కరీంనగర్ పోలీస్ కమిషనర్ వెన్నవెల్లి బాగన్నగారి కమలాసన్ రెడ్డి కూడా ఈ గ్రామానికి చెందినవారే కావడం విశేషం.
సినిమా షూటింగ్‌లకు స్పాట్‌గా ధరిపల్లి
మెదక్ నియోజకవర్గం చిన్న శంకరంపేట (ఆర్) ధరిపల్లి గ్రామం సువిశామైనది. హైదరాబాద్ పట్టాణానికి అత్యంత దగ్గరలో ఉన్న అందమైన పల్లెటూరు. పకృతి తీర్చిదిద్దిన అందమైన లోకేషన్లు. చెరువు గట్టు మీద కూర్చొని చూస్తే కనుచూపుమేరా కనిపించే పచ్చదనం. నిజం చెప్పాలంటే భూమికి పచ్చని చీరకట్టినట్లు కనిపించే సౌందర్యం ఈ ఊరి సొంతం. ఇటీవల కాలంలో ధరిపల్లి సినిమా షూటింగ్‌లకు అడ్డాగా మారింది. ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా అర్థభాగం ధరిపల్లిలోనే నిర్మించారు. అలాగే హీరో శ్రీరామ్ నటించిన అసలేం జరిగింది సినిమా కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. ఇవే కాకుండా ఓ డాక్యూమెంటరీ కూడా తీశారు. ఈ సినిమాలతో పాటు పలు షాట్ ఫిల్మింలు కూడా చిత్రికరించారు.
అందమైన పల్లె వాతావరణం, విశాలమైన ఇళ్ల నిర్మాణం, హరిద్రనది పరివాహాక ప్రాతం, గ్రామంలో ఎక్కువ భాగం పంటలు పండించడంతో చూడటానికి పచ్చగా ఉంటుంది. పరిసర మండాల్లోని గ్రామాల్లో లేని రచ్చబండా (కషీర్) ఈ గ్రామానికే ప్రత్యేకత, ఓ వైపు గ్రామ పంచాయతీ కార్యాలయం, దాని ఎదురుగా విశాలమైన రాతి కట్టడంతో ఉన్న కషీర్, దాని ప్రక్కన రాతి కట్టడంతో నిర్మించిన గాంధీ విగ్రహాం కూడలి, మరోప్రక్క రామాలయం, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇవి ధరిపల్లి గ్రామానికే పేరుగడించాయి. ఇవి ఇలా ఉంటే గ్రామంలో అతిపెద్ద ఊడల మర్రి చెట్టూ ఇది దాదాపు రెండు, మూడె ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ మర్రి చెట్టు కింద నల్లపోచ్చమ్మ దేవాలయం చూడముచ్చటగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే కనువిందే చేసే అందాలు ఎన్నో ధరిపల్లి సొంతం అని చెప్పుకోవాలి.
మరో విషయం చెప్పుకోవాలంటే ధరిపల్లి పాఠశాల గ్రామానికి చెందిన స్వర్గీయ టేక్మాల్ హనమంత రెడ్డి నిర్మించిన ప్రభుత్వ పాఠశాల. ఊరికి దూరంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాలమైన వాతావరణంలో ఈ పాఠశాల నిర్మాణం ఉంటుంది.
నేరవేరిన సాయి పల్లవి కోరిక
విరాట పర్వం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ శివాలయాన్ని దర్శించుకున్నారు హీరోయిన్ సాయిపల్లవి. అక్కడ తన మనుసులో కోరుకున్న కోరిన నేరవేరిందని. ఆ విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని సాయిపల్లవి తన మిత్రులతో చెప్పినట్లు సమాచారం.
శ్రీనివాస్, జర్నలిస్ట్.
7013211961