సినీ నటుడు కత్తి మహేష్ కు యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు యాక్సిడెంట్ అయినప్పటినుంచి ఆయనపైన సోషల్ మీడియా హోరెత్తింది. ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టుల పరంపర వర్షంలా కురుస్తోంది. ఈ విషయమై హైదరాబాద్ కు చెందిన ఒక అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ ఆసక్తికరమైన పోస్టును సోషల్ మీడియా ఫేస్ బుక్ లో తన వాల్ మీద పోస్టు చేశారు. ఆయన ఏం పోస్టు చేశారో ఆ పోస్టు కంటెంట్ ను యాజిటీస్ గా కింద ఇచ్చాము మీరూ చదొచ్చు….
కత్తిమహేష్ కు ప్రమాదం జరిగిందని చాలా క్రిటికల్ గా ఉన్నాడని సోషల్ మీడియా లో చూశాను…వెంటనే కామెంట్లు చూస్తే…బండ బూతులు….జనాలు సానుభూతి చూపించకుండా…తిడుతున్నారు…అయ్యే అనాలో..ఖండించాలో తెలియక
విషయం విశ్లేషణ…చేస్తున్న…
జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో సాదించాలని ఉంటది..
కానీ
ఎందరో రాత్రికి రాత్రి …సెలెబ్రెటీ అయి పోవడానికి…అడ్డదారులు ఎంచుకుంటారు..
కొందరే…నిజాయితీగా ఆలస్యం అయిన పర్లేదు.. మెట్టు మెట్టు ఎక్కుతూ…విజయస్థంబాని ముద్దాడుతారు..
చాలా సార్లు మీడియాలో చూసే ఉంటాం…గొప్ప చదువు చదివినవాళ్ళు…దొంగలు అయిన వార్తలు…డ్రగ్ కు బానిస ఐనవాళ్లను చూశాం…
మన జ్ఞానం, శ్రమ అడ్డదారి తొక్కితే….సెలెబ్రెటీ తొందరగా కావచ్చు కానీ…కుండ బద్దలైన రోజు…కనీసం దాహం తీర్చుకోడానికి గుక్కెడు నీళ్లు దొరకద్దు…
సమాజం చరిత్రలో ఎందరినో ప్రేమించింది…
ద్వేషించింది…
Ex: గాంధీ,అబ్దుల్ కలాం,—–హిట్లర్, గాడ్సే,…
ఏది ఏమైనా…ఒకరి చావును కోరుకునే అంతా మూర్ఖంగా మనం ప్రవర్తించవద్దు…
సమాజంలో బ్రతికినాన్ని రోజులు సమాజాన్ని నాశనము చేసే లాగా వాళ్ళు ప్రవర్తించవద్దు….
రెండు…సమర్దనియం…కాదు…
కానీ
ఒక్కటి మాత్రం నిజం…
నిజాయితీతో కూడిన…విజయమే…విజయం సాధిస్తుంది..
ఇట్లు
చౌహన్
Advocate.
ఈ వార్త కూడా చదవండి…