కరోనా ఉధృతి సెకండ్ వేవ్ లో ఎంతలా ఉందో చూశాం, ఇక థర్డ్ వేవ్ గురించి జనం భయపడుతున్నారు. అంతేకాదు టీకాని కూడా ప్రతీ ఒక్కరు తీసుకుంటున్నారు. ఇక కాస్త కేసులు తగ్గడంతో ప్రజలు అందరూ తమ పనులు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేస్తున్నారు. ఇక ఏపీ విద్యాశాక ఈ సమయంలో పరీక్షలకు సిద్దం అవుతోంది.
కామన్ ఎంట్రన్స్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ప్రకటించారు. మరి ఆ పరీక్షలు తేదిలు ఎప్పుడు ఉంటాయి అనేది చూద్దాం.
1.జెఎన్టీయూ కాకినాడ నిర్వహించే AP EAPCET ఆగస్టు 19 – 25 మధ్యలో నిర్వహించనున్నారు.
2.విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సిటీ నిర్వహించే ICET పరీక్షను సెప్టెంబర్ 17-18 న నిర్వహించనున్నారు.
3.జెఎన్టీయూ అనంతపురం నిర్వహించే ECET పరీక్షను సెప్టెంబర్ 19న నిర్వహిస్తారు.
4.తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నిర్వహించే LAWCET పరీక్షను సెప్టెంబర్ 22న నిర్వహిస్తారు
5.తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నిర్వహించే PGECET పరీక్షలను సెప్టెంబర్ 27-30 తేదీల్లో నిర్వహించనున్నారు
6. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే EDCET పరీక్షను సెప్టెంబర్ 21న నిర్వహించనున్నారు. .