అంగవైకల్యం ఉన్న వ్యక్తి అయ్యప్ప గుడిలో ఏం చేశాడో చూడండి

అంగవైకల్యం ఉన్న వ్యక్తి అయ్యప్ప గుడిలో ఏం చేశాడో చూడండి

0
127

కొందరికి కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నా తమ పని తాము చేసుకోరు, ఇతరుల మీద ఆధారపడతారు,, అన్ని అవయవాలు సక్రమ స్దితిలో ఉన్న వారు బద్దకంతో ఉంటారు. ఇలాంటి వారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అయితే కార్తీక మాస కాలంలో అయ్యప్ప భక్తుల తాకిడి దేవాలయాల్లో ఎక్కువగా ఉంటుంది.. ఎంతో నిష్టగా నియమాలతో అయ్యప్పని కొలుస్తారు.

మండలదీక్ష తీసుకుని స్వామి సేవలో ఉంటారు స్వామి మాల వేసుకున్న భక్తులు నియమాలు పాటిస్తూ కఠోర దీక్ష చేస్తారు, అయితే ఇలా అందరూ చేయడం వేరు అంగవైకల్యం ఉన్న వ్యక్తి చేయడం వేరు, తమిళనాడుకు చెందిన సాగర్ అనే వ్యక్తికి చిన్నతనం నుంచి రెండు కాళ్లు లేవు.. కాని ఆయన ఆ వైకల్యాన్ని పట్టించుకోలేదు, ఈ సమయంలో అయ్యప్ప మాల వేసుకుని స్వామి మాలాదీక్ష చేశాడు, అయ్యప్ప కోసం కాలినడకన శబరి మెట్లు ఎక్కాలి అని అనుకున్నాడు,

ఇక శబరిమల మెట్లు ఎక్కుతున్న సమయంలో ఇరుముడి కట్టుకుని ఆయన తన రెండు చేతులని నేలని ఆన్చుతూ ముందుకు నడిచాడు.. శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయంలో మెట్లు ఎక్కుతూ ఆనందించాడు,….ఆ సమయంలో అందరూ ఆయనని చూసి ఆశ్చర్యపోయారు, అయ్యప్ప అయ్యప్ప అంటూ స్వామిని స్మరించుకున్నారు, ఆ సమయంలో ఆయన పట్టుదలని చూసిన ప్రతీ ఒక్కరూ ఆయనకు దారి ఇచ్చి మెట్లు ఎక్కేందుకు సాయం చేశారు. అక్కడ ఉన్న వారు అతని దీక్షని వీడియో తీసి, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.